Homeజిల్లాలునిజామాబాద్​Dharpally | పిచ్చికుక్కల దాడి.. పలువురు చిన్నారులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

Dharpally | పిచ్చికుక్కల దాడి.. పలువురు చిన్నారులకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

- Advertisement -

అక్షరటుడే, ధర్పల్లి: Dharpally | పిచ్చికుక్కల దాడిలో పలువురు చిన్నారులకు గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన ధర్పల్లి మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దమ్మన్నపేట (Dammanapeta) గ్రామ పరిధిలోని మరియా తండాలో ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారులు వరుణ్​, హర్షిత్​తో పాటు మరో బాలుడిపై పిచ్చికుక్కలు దాడి చేశాయి.

దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు చిన్నారులను మొదట ధర్పల్లి ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించారు. అందులో ఓ బాబు పరిస్థితి విషయంగా ఉండడంతో హైదరాబాద్​కు తీసుకెళ్లారు. గ్రామాల్లో పిచ్చికుక్కలు, కోతుల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తక్షణమే వాటిని గ్రామాల నుంచి తరలించాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.