అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha)కు తన పెంపుడు కుక్కతో విడదీయలేనంత అనుబంధం ఏర్పడింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దాదాపు ఆరేళ్లుగా కవిత ఇంట్లో ఉంటోంది. అయితే, అనుకోకుండా పెంపుడు కుక్క (pet dog) కళ్లు పోవడంతో ఆమె కలత చెందారు. ఇదే విషయాన్ని ఓ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో వివరిస్తూ.. తన కళ్లలో నీళ్లు తెచ్చుకున్నారు. తనను కష్టాలు చుట్టుముట్టిన సమయంలో తన పెట్ భాగస్వామ్యం పంచుకుందని చెప్పారు.
పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. కష్టాలు చుట్టుముట్టిన సమయంలోనే తన పెంపుడు కుక్క కళ్లు పోయాయని గద్గద స్వరంతో తెలిపారు. ఈ విషయాన్ని చెబుతున్న సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
MLC Kavitha : ఈడీ, సీబీఐ విచారణ సమయంలో..
తన కష్టాల్లో పెట్ కూడా భాగస్వామ్యం పంచుకుందని కవిత తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసు(liquor scam case)లో ఈడీ ED, సీబీఐ (CBI) తొలిసారి విచారిస్తున్న సమయంలోనే పెట్ కళ్లు పోయాయనని చెప్పారు. ఆ సమయంలో తాను ఎంతో బాధపడ్డానని వివరించారు. మనకు వచ్చే కష్టసుఖాలపై కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులు కూడా స్పందిస్తాయని చెబుతారన్నారు.
‘ఈడీ, సీబీఐ తొలిసారి విచారిస్తున్న సమయమది. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా మా పెట్ కి రెండు కళ్లు పోయాయి. అప్పుడు దాని వయస్సు మూడేళ్లే. 11 ఏళ్లు బతకాల్సిన కుక్కకు ఇలా జరగడం చూసి చాలా బాధేసింది. దాని కోసం కొన్ని రోజులు ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచాం. ఎందుకంటే దానికి ఇంట్లో ఎక్కడ ఏముంటుందో తెలుసు కాబట్టి. అందుకే ఇంట్లో ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడే ఉంచాం, తప్పితే మార్చలేదని’ వివరించారు.