అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Police | ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో (Intercity Express) దారుణం చోటుచేసుకుంది. ట్రెయిన్లో వాటర్ బాటిళ్లు విక్రయించే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
రైల్వే ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అకోలా నుంచి నిజామాబాద్ మీదుగా కాచిగూడ(Kachiguda) వెళ్లే ఇంటర్ సిట్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఉదయం నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామానికి చెందిన అతిశ అనే వ్యక్తి ఎక్కాడు.
Railway Police | వాటర్ బాటిల్ విషయంలో గొడవ..
అతడు రైల్లో వాటర్ బాటిళ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే రైలులోని డీ–6 కోచ్‌లో వాటర్ బాటిళ్లు విక్రయిస్తుండగా.. ఉమ్రి గ్రామానికే చెందిన షేక్ జమీర్ అనే వ్యక్తితో వాటర్ బాటిల్ విషయంలో గొడవ జరిగింది.
ఈ క్రమంలో ఆవేశానికి లోనైన జమీర్.. అతిశను గాజు గ్లాసుతో పొడిచి, రైలు దిగి పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra) లోని కరికెల్లి – ధర్మాబాద్ మధ్య జరిగింది.
కాగా, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్‌కు చేరుకున్నాక.. రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే వైద్యులను పిలిపించారు.
వైద్యులు అక్కడికి చేరుకుని బాధితుడిని పరీక్షించగా.. తీవ్ర రక్తస్రావంతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాందేడ్‌కు సమాచారం అందించామని రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
