అక్షరటుడే, వెబ్డెస్క్ : Vikarabad | వికారాబాద్ జిల్లాలో (Vikarabad district) దారుణం చోటు చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు వదినపై కొడవలితో దాడి చేశాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ దాడిలో చిన్న కూతురు(daughter), వదిన మృతి చెందగా, భార్య, మరో కూతురు తప్పించుకున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల (Kulkacharla mandal) కేంద్రంలో యాదయ్య (38) నివాసముంటున్నాడు. ఆయనకు భార్య అలివేలు (32), ఇద్దరు కూతుర్లు అపర్ణ, శ్రావణి (10) ఉన్నారు. కొద్ది కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల వద్ద పంచాయితీ నడుస్తోంది.
భార్యభర్తల మధ్య శనివారం కూడా గొడవ జరిగింది. దీంతో వారికి సర్దిచెప్పేందుకు భార్య అలివేలు సోదరి హన్మమ్మ (40) వచ్చింది. అందరూ కలిసి శనివారం రాత్రి నిద్రకు ఉపక్రమించగా, యాదయ్య కొడవలితో భార్య, బిడ్డలతో పాటు వదినపై దాడి చేశాడు. పెద్ద కూతురు అపర్ణ తప్పించుకుని బయటకు పారిపోగా, వదిన హన్మమ్మ, చిన్న కూతురు శ్రావణి మృతి చెందారు. దాడి అనంతరం నిందితుడు యాదయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తప్పించుకున్న అపర్ణ స్థానికులను తీసుకుని ఇంటికి వచ్చి చూడగా, ముగ్గురు మృతి చెంది ఉన్నారు. భార్య అలివేలు గాయాలతో బయటపడగా, ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి (government hospital) తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
