అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Nizamabad | నగరంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి విషయంలో గొడవపడి ఒక ఇంట్లో ముగ్గురు గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. అందులో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు చావు బతుకుల మధ్య ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలోని శివాజీ నగర్ (Shivaji Nagar)లో నివాసముండే దాసరి కిషన్ స్థానికంగా యూనియన్ బ్యాంకు (Union Bank) ఎదుట కర్రీ పాయింట్ నడిపిస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడికి వివాహం కాగా పెద్ద కుమారుడికి వివాహం కాలేదు. అయితే మంగళవారం మధ్యాహ్నం పెద్దకొడుకు వివాహం నేపథ్యంలో గొడవ జరగింది. దీంతో కిషన్, ఆయన భార్య, పెద్ద కుమారుడు ఆవేశంలో గడ్డి మందు తాగారు.
స్పందించిన స్థానికులు వెంటనే ఆ ముగ్గురిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దాసరి కిషన్ బుధవారం ఉదయం మృతి చెందాడు. మిగితా ఇద్దరిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. 2వ పోలీస్‌స్టేషన్ సీఐ శ్రీనివాస్‌రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.