HomeతెలంగాణAttempted murder | సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిపై హత్యాయత్నం

Attempted murder | సూర్యాపేట జిల్లాలో దారుణం.. ముగ్గురిపై హత్యాయత్నం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Attempted murder : సూర్యాపేట జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు ఐదుగురు వ్యక్తులు కారులో వెంబడించారు.

సూర్యాపేట(Suryapet)లో ఖమ్మం (Khammam) క్రాస్ రోడ్ నుంచి బైక్​పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) కారులో దుండగులు వెంబడించారు.

Attempted murder : వైన్స్ లోకి పరుగులు..

దుండగుల నుంచి తప్పించుకునేందుకు బాధితులు ద్విచక్ర వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. అయినప్పటికీ దుండగులు వదలకపోవడంతో బీబీగూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాప్ ఎదుట బైక్​ను పడేసి, షాప్​లోకి పరుగులు పెట్టారు బాధితులు.

దీంతో కారును ఆపిన దుండగులు కత్తులు, కర్రలతో కారు దిగి.. వైన్స్ లోకి వెళ్లడానికి ప్రయత్నంచారు. అయితే అప్పుడే వైన్స్ షాప్​(wine shop)లో నుంచి జనాలు బయటకు రావడంతో వారిని చూసిన దుండగులు కారు ఎక్కి, అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనకు సంబంధించి అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.