Homeజిల్లాలునిజామాబాద్​Mopal | సింగంపల్లిలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన బంధువులు

Mopal | సింగంపల్లిలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన బంధువులు

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mopal | ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన మోపాల్ మండలం సింగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మోపాల్​ మండలంలోని పోలీసులు పట్టించుకోకపోవడంతో సీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొంది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం సింగంపల్లి (Singampally) గ్రామానికి చెందిన పల్లికొండ సవిత నిజామాబాద్​లోని (nizamabad) ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో పని చేస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన సవిత బావ పల్లికొండ గంగారం తన ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెలు తరచూ సవిత ఇంట్లోకి వచ్చి మూత్రవిసర్జన చేయడం, బియ్యం తినేయడం చేస్తున్నాయి. దీంతో పలుమార్లు సవిత వారికి చెప్పింది.

అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో చివరకు పల్లికొండ సవిత పల్లికొండ గంగారాం కొట్టంలో ఉన్న గేదెను తీసుకొచ్చి గ్రామంలోని హనుమాన్​ మందిరం వద్ద ఉన్న చెట్టుకు కట్టేసింది. దీంతో తమ గేదెనే కట్టేస్తావా అంటూ.. బావ పల్లికొండ గంగారాం, చంద్రంపల్లి లక్ష్మి, ఆయన కొడుకు గంగారాం, కోడలు మమత కలిసి సవితపై మంత్రాలు చేస్తోందని ఆరోపిస్తూ చెట్టుకు కట్టేసి చితకబాదారు.

మతిస్థిమితం కోల్పోయిన భర్త, నలుగురు పిల్లలతో కలిసి జీవితం నెట్టుకొస్తున్న సవిత గత్యంతరం లేక మోపాల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని.. చివరకు సీపీ సాయిచైతన్యను (CP Sai chaitanya) కలిసి ఫిర్యాదు చేసేందుకు గురువారం సీపీ కార్యాలయానికి వచ్చానని ఆమె పేర్కొంది.