- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Bypass | ​పోలీసులమని చెప్పి నిలువు దోపిడీ..

Nizamabad Bypass | ​పోలీసులమని చెప్పి నిలువు దోపిడీ..

- Advertisement -

అక్షరటుడే, వెబ్ డెస్క్: Nizamabad Bypass : పోలీసులమని చెప్పి అమాయకులను నిలువునా దోచుకున్న ఘటన నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో వెలుగు చూసింది. డిచ్​పల్లి ఎస్సై మహమ్మద్​ షరీఫ్​ dichpally si Shareef కథనం ప్రకారం.. ఇందల్వాయి మండలం రూప్లతండాకు చెందిన ఇథియా నాయక్ తన మనవడితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మాధవ నగర్ బైపాస్ madhavanagar bypass మీదుగా నిజామాబాద్ వెళ్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వారి వద్దకు వచ్చారు.

తాము పోలీసులమని చెప్పి ID cards ఐడీ కార్డులు చూపించారు. మాయమాటలు చెప్పి, వారి వద్ద నుంచి బంగారు గొలుసు, ఉంగరం కాజేశారు. వాటికి బదులుగా నకిలీ గొలుసు, రింగు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు డిచ్​పల్లి ఠాణాలో కేసు నమోదు అయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News