అక్షరటుడే, వెబ్‌డెస్క్: mid-day meal : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. Primary School మధ్యాహ్న భోజనం mid-day meal తిన్న 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాధిత విద్యార్థులను హుటాహుటిన బిచ్కుంద ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
mid-day meal : మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ
బిచ్కుంద మండలం (Bichkunda Mandal) శెట్లూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు.
విషయం తెలుసుకుని హుటాహుటిన బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి షిండే చేరుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రిలోని వైద్యులతో మాట్లాడారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హన్మంత్ షిండే ఈ సందర్భంగా సూచించారు.