Akshara Today: Pet dog bites : పెంపుడు జంతువులు యజమానికి విశ్వాసపాత్రులుగా ఉంటాయంటారు. పెంపుడు శునకాల pet dogs విషయంలో అయితే మరీను. తన యజమాని కోసం ప్రాణాలు ఇస్తాయంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ జరిగింది. ఓ పెంపుడు కుక్క యజమాని ప్రాణం తీసింది. యజమాని మర్మాంగాలను కొరుక్కుతిని చంపేసింది.
ఈ దారుణ ఘటన హైదరాబాద్ – మధురానగర్‌లోని hyderabad Madhura nagar ఓ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. తన ఫ్లాట్లో పెంపుడు కుక్కతో కలిసి పవన్ కుమార్(37) నిద్రించారు. ఉదయం అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా, ఎంతకీ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో చుట్టుపక్కల వారితో కలిసి డోర్ పగలగొట్టి చూడగా, రక్తపు మడుగులో పవన్ కుమార్ చనిపోయి కనిపించారు.
పవన్ కుమార్ అవయవాలు కొరుక్కుతిని, నోటి నిండా రక్తంతో పెంపుడు కుక్క పక్కనే ఉండటం చూసినవారంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
