అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Minor Gangrape Case | హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు రౌడీ షీటర్లు సామూహిక అత్యాచారం చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ (Narsingi Police Station) పరిధిలో ఈ ఘటన చోసుకుంది.
ముగ్గురు రౌడీ షీటర్లు ఓ బాలికకు గంజాయి తాగించారు. ఆమె మత్తులో ఉండగా అత్యాచారం చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారు అయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)కి తరంలిచారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Minor Gangrape Case | ముందే పరిచయమా..
సదరు బాలికకు రౌడీ షీటర్లతో ముందే పరిచయం ఉందా.. లేక బలవంతంగా ఎత్తుకొని వచ్చి అత్యాచారం చేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. వారి కోసం గాలిస్తున్నారు. కాగా బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Hyderabad Minor Gangrape Case | విశాఖలో చిన్నారిపై..
విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District)లో మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. పెదగంట్యాడ మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారికి తినుబండరాలు కొనిస్తానిన చెప్పి తీసుకెళ్లిన యోగి అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి ఏడుస్తుండటంతో తల్లి ప్రశ్నించగా విషయం చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.