అక్షరటుడే, వెబ్డెస్క్: Britain | బ్రిటన్లో దారుణం చోటు చేసుకుంది. భారతీయ యువతిపై (Indian Girl) ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బ్రిటన్లో జాత్యహంకారంతో యువతులపై అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో సిక్కు మహిళపై దుండగుడు లైంగిక దాడి చేయగా.. తాజాగా మరో యువతిపై అత్యాచారం జరిగింది.
యూకేలోని వెస్ట్ మిడ్‌ల్యాండ్‌లో (West Midlands) ఈ ఘటన చోటుచేసుకుంది. లండన్ కాలమానం ప్రకారం.. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాల్సల్ ప్రాంతంలో ఓ యువతిపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించారు. బాధిత యువతిని ఆస్పత్రికి తరలించారు.
Britain | నిందితుడి కోసం గాలింపు
సీసీ టీవీ ఫుటేజీ (CCTV Footage) ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించారు. 30 ఏళ్ల శ్వేత జాతీయుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. బాధితురాలు పంజాబీ యువతి అని సిక్కు ఫెడరేషన్ యూకే (Sikh Federation UK) తెలిపింది. నిందితుడు ఆమె నివాసం ఉంటోన్న ఇంటి తలుపు బద్దలు కొట్టి అత్యాచారం చేశాడు. గత నెల ఓ సిక్కు యువతిపై ఇదే ఇలాగే లైంగిక దాడి జరిగింది. యూకేలో వరుస ఘటనలతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

