4
అక్షరటుడే, ఆర్మూర్: Armoor | అనుమానం పెనుభూతమైంది.. ఓ మహిళ దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో (Venkateswara Colony) బాపట్లకు (Bapatla) చెందిన భార్యభర్తలు జగదీష్, వడ్ల మమత నివాసముంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వడ్ల జగదీష్ కట్టె మిషన్లో పనిచేస్తున్నాడు.
అయితే భార్యపై కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి కత్తితో భార్య మెడకోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. అయితే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.