ePaper
More
    HomeతెలంగాణAtrocity case | ఎస్సైపై అట్రాసిటీ కేసు.. ఎందుకో తెలుసా?

    Atrocity case | ఎస్సైపై అట్రాసిటీ కేసు.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Atrocity case | వరంగల్​ (Warangal) మిల్స్​ కాలనీ పోలీస్ స్టేషన్​ ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీకాంత్​ (SI Srikanth) ఇటీవల అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన ఫాస్ట్​ఫుడ్​ నిర్వాహకులపై దాడి చేశారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు.

    వరంగల్​ ఫోర్ట్​ రోడ్డులో (Warangal Fort Road) ఓ మహిళ ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ నడుపుతోంది. శుక్రవారం రాత్రి ఎస్సై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​కు వచ్చాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ (fast food center) నిర్వహిస్తున్న దళిత మహిళ సండ్ర మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై దాడి చేశాడు. రాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచినందుకు వారిని తిట్టాడు. అంతేగాకుండా మరియమ్మ చెంపపై కొట్టాడు. సీసీ కెమెరాలో (CCTV camera) ఎస్సై దాడి చేసిన దృశ్యం రికార్డు అయింది. ఈ వీడియోలు వైరల్​ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.

    Atrocity case | బాధితుల ఫిర్యాదు మేరకు

    తమను కులం పేరుతో దూషించి, చేయి చేసుకున్నాడని మరియమ్మ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC and ST atrocity Case) నమోదు చేశారు. కాగా ఎస్సై శ్రీకాంత్ కూడా ఫిర్యాదు చేయగా.. మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    Atrocity case | నెటిజన్ల ఆగ్రహం

    ఎస్సై శ్రీకాంత్​ (SI Srikanth) ఫాస్ట్​పుడ్​ సెంటర్​ నిర్వాహకులపై దాడి చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వరకు దుకాణం తెరిచి ఉంచితే మూసి వేయాలని చెప్పాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్నారు. ఓ మహిళ అని చూడకుండా ఎస్సై దాడికి పాల్పడటం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

    Latest articles

    Kamareddy District Judge | లైంగిక దాడి కేసులో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy District Judge | లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఒకరికి పదేళ్ల జైలు శిక్ష...

    PCC Chief | బీఆర్‌ఎస్‌ నాలుగు ముక్కలయ్యింది.. పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : PCC Chief | రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. త్వరలో స్థానిక ఎన్నికలు (Local Body...

    Yellareddy | మట్టి గణపతులే ప్రతిష్టించాలి

    అక్షర టుడే, ఎల్లారెడ్డి: Yellareddy | వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని ఎల్లారెడ్డి...

    Nizamsagar project | మంజీరలో చిక్కుకున్న కాపర్లు..

    అక్షర టుడే, నిజాంసాగర్: Nizamsagar project | నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువన మంజీర నదిలో (Manjira...

    More like this