అక్షరటుడే, కామారెడ్డి: Machareddy | సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చిన బాలుడు నీటి గుంటలో పడి మృత్యువాత పడ్డాడు. మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ (medak) జిల్లా రామాయంపేటకు (RamayamPet) చెందిన సందీప్- శ్రీలత రెండో కుమారుడు యశ్వంత్(4) రెండు రోజుల క్రితం అమ్మమ్మతో కలిసి వాళ్ళ గ్రామమైన కొత్తపల్లికి (Kothapalli) వచ్చారు. అయితే బుధవారం ఆడుకుంటూ వెళ్లిన యశ్వంత్ ఇంటివద్ద ఉన్న నీటి కుంటలో పడ్డాడు. స్థానికులు గమనించేసరికే యశ్వంత్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన కొత్తపల్లికి చేరుకుని విగతజీవిగా ఉన్న కొడుకుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.