తన తల్లి, చెల్లిని లైట్స్ ఆపి కొట్టారంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనల్ (Influencer Meenal) పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్లు వేసి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. సిబ్బందిని నిలదీయడంతో లైట్స్ ఆపి కొట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బేబిలాన్ పబ్‌పై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు(Jubilee Hills police) దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.