అక్షరటుడే, ఇందూరు: ATM robbery దొంగలు రెచ్చిపోయారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్స్ ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక ఏటీఎంల చోరీ ఘటనలకు లెక్కే ఉండటం లేదు. తాజాగా తెలంగాణ Telangana లోని నిజామాబాద్ జిల్లా Nizamabad district లో భారీ చోరీ ఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు రెండు ఏటీఎంలలో చోరీకి యంత్రించిన దుండగులు.. యంత్రాలు తెరుచోకపోవడంతో వాటిని తగలబెట్టారు. అనంతరంలో వాటిల్లోని సుమారు రూ. 50 లక్షలకు పైగా నగదును దోచుకెళ్లారు.
నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దుండగులు ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన దొంగలు SBI ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు కాజేయాలని యత్నంచారు. కానీ, తెరుచుకోకపోవడంతో దానిని తగలబెట్టారు. అనంతరం ఏటీఎంలోని సుమారు రూ. 27 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
ATM robbery | మరో యంత్రం..
ఇక నాలుగో ఠాణా పరిధిలోని మరో ఏటీఎంలోనూ చోరీ జరిగింది. ఇక్కడి ఏటీఎం కూడా తెరుచుకోకపోవడంతో దానిని కూడా కాలబెట్టారు. ఇందులో ఉన్న దాదాపు రూ. 25 లక్షల నగదును దోచుకున్నారు. కాగా, ఒకేరోజు రెండు ఏటీఎంల చోరీ ఘటనలు స్థానికంగా చర్చకు దారితీశాయి. సంఘటన స్థలాలను DCP బసవ రెడ్డి, ACP రాజా వెంకట్ రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు బైక్పై, కారులో రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.