అక్షరటుడే, నవీపేట్: ATM theft ఏటీఎం పగులగొట్టి, నగదు చోరీకి యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా(Nizamabad district) నవీపేట్ మండలం(Navipet mandal)లో చోటుచేసుకుంది. నవీపేట్లోని రాంపూర్ రోడ్డులో ఉన్న SBI Bank ATM లో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఓ వ్యక్తి క్యాష్ యంత్రాన్ని పగులగొట్టి నగదు దొంగిలించే ప్రయత్నం చేశాడు.
అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ (patrolling) సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు రెంజల్ మండలం కూనేపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
