అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | క్రీడాకారులు తమ ప్రతిభతో క్రీడల్లో రాణించి తెయూకు గుర్తింపు తేవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి (TU Registrar Yadagiri) పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాల కబడ్డీ (పురుషుల) ఎంపికలు శుక్రవారం కళాశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి.
స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషణ్(Sports Director Balakishan) ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి ఏదో ఒక క్రీడలో ప్రవేశం ఉండాలన్నారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ.. వర్సిటీలో క్రీడా విభిగంలో సౌకర్యాల మెరుగునకు ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్నారు.
కబడ్డీలో ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెల 4వ తేదీ నుంచి కర్ణాటకలోని (karnataka) రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో జరిగే సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ టోర్నీలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో కళాశాలల పీడీలు బాలమణి, అనిల్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్ నేత, నరేశ్ క్రీడాకారులు పాల్గొన్నారు.