అక్షరటుడే, వెబ్‌డెస్క్: Women World Cup 2025 | ముంబయిMumbai వేదికగా జరిగిన మహిళల వరల్డ్ కప్‌లో శ్రీలంక – బంగ్లా మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితమైన పోరుగా నిలిచింది. చమరి ఆటపట్టు చివరి ఓవర్ మ్యాజిక్ ఇప్పుడు సోషల్ మీడియా social media లో ట్రెండింగ్‌గా మారింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. వర్షం కారణంగా స్వదేశంలో మ్యాచ్‌లు రద్దయి సెమీస్ రేసులో వెనుకబడిన లంక, ముంబయిలో Mumbai బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 7 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచింది. 203 పరుగుల లక్ష్యంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఆరంభం అంత బాగాలేకపోయినా, మధ్య వరకు పోరాటం కొనసాగింది.
కెప్టెన్ నిగర్ సుల్తానా (77), షమిన్ అక్తర్ (67 రిటైర్డ్ హర్ట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి బంగ్లాను గెలుపు దిశగా నడిపించారు. అయితే చివరి ఓవర్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు మ్యాజిక్ చూపించింది.
Women World Cup 2025 | సూపర్ బౌలింగ్..
9 పరుగులు అవసరమైన పరిస్థితిలో చమరి తొలి బంతికే రబేయా ఖాన్‌ను ఎల్బీగా ఔట్ చేసింది. రెండో బంతికి నిహిదా అక్తర్ రనౌట్ కాగా, మూడో బంతికి కెప్టెన్ నిగర్ సుల్తానా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
నాలుగో బంతికి మరుఫా అక్తర్ ఎల్బీ అవడంతో బంగ్లాదేశ్ గెలుపు కల చెదిరిపోయింది. ఆఖరికి బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌట్ అయి 7 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈ మ్యాచ్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. “What a sensational final over by Captain Chamari Athapaththu… WOW! Just WOW!” అంటూ ఎక్స్ (Twitter)లో ప్రశంసల వర్షం కురిపించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. కానీ కెప్టెన్ చమరి ఆటపట్టు (46), హాసిని పెరీరా(85) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా మలిచారు.
నీలాక్షి డిసిల్వా (37) సాయం అందించడంతో శ్రీలంక స్కోర్ 202 పరుగుల దాకా చేరుకుంది. బంగ్లాదేశ్ బౌలర్ షోర్నా అక్తర్ (3/27) అద్భుతంగా బౌలింగ్ చేస్తూ లంక ఇన్నింగ్స్‌ను కట్టడి చేసింది.
చివర్లో రబేయా ఖాన్, షోర్నా అక్తర్ బౌలింగ్ మెరుపులతో లంకను ఆలౌట్ ప్రమాదంలోకి నెట్టినా, లంక బ్యాటర్ ప్రబోధిని చివర్లో జట్టును 200 దాటేలా చేసింది.
ఈ విజయంతో శ్రీలంక తమ పాయింట్ల ఖాతా తెరిచింది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ Bangladesh తర్వాత వరుసగా ఓటములు ఎదుర్కొంటూ సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయింది.