ePaper
More
    HomeజాతీయంAtal Pension Yojana | ‘అటల్‌ పెన్షన్‌’కు విశేష ఆదరణ.. చందాదారులు ఎంతమందంటే..!

    Atal Pension Yojana | ‘అటల్‌ పెన్షన్‌’కు విశేష ఆదరణ.. చందాదారులు ఎంతమందంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Atal Pension Yojana | అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం(Central government) అమలు చేస్తున్న అటల్‌ పెన్షన్‌ యోజనకు విశేష ఆదరణ లభిస్తోంది. పదేళ్లలోనే 7.65 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. ఈ స్కీమ్‌(Scheme)లో చేరేందుకు మహిళలూ ఎక్కువగా ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ పథకం వివరాలు తెలుసుకుందామా..

    అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యం(Old age)లో భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015 మేలో అటల్‌ పెన్షన్‌ యోజన(Atal Pension Yojana) పేరుతో రిటైర్మెంట్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ తక్కువ ఆదాయం గలవారికోసం ప్రవేశపెట్టింది. ఇది ఆకర్షణీయంగా ఉండడంతో ఇందులో చేరేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. దీంతో గతనెల చివరి నాటికి చందాదారుల సంఖ్య 7.65 కోట్లకు చేరింది. మొత్తం కార్పస్‌ ఫండ్‌ రూ. 45.94 వేల కోట్లకు పెరిగింది. కాగా ఈ పథకంలో చేరుతున్న మహిళల సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు ఉన్న చందాదారుల్లో మహిళలు 48 శాతం కావడం గమనార్హం.

    Atal Pension Yojana | పథకం వివరాలు..

    18 నుంచి 40 ఏళ్లున్నవారు అర్హులు. సామాజిక భద్రత పథకాలైన ఈపీఎఫ్‌(EPF), ఎన్‌పీఎస్‌లు వర్తించని అసంఘటిత రంగాల కార్మికులై ఉండాలి. వయసు ఆధారంగా ప్రతినెలా రూ. 42 నుంచి రూ. 1,454 వరకు premium చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత పెన్షన్‌ అందుతుంది. పెన్షన్‌ మొత్తం చందాదారు చెల్లించే నెలవారీ ప్రీమియం, చెల్లించిన కాలంపై ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.5 వేల పెన్షన్‌ పొందవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.5 వేల పెన్షన్‌ కోసం 18 ఏళ్ల వయసులో అటల్‌ పెన్షన్‌ స్కీంలో చేరితే.. నెలకు రూ.210 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే 25 ఏళ్ల వ్యక్తి అయితే రూ. 376, 30 ఏళ్ల వ్యక్తి రూ. 577 ప్రీమియం చెల్లించాలి.

    Atal Pension Yojana | చందాదారు మరణిస్తే..

    అటల్‌ పెన్షన్‌ స్కీం(Atal Pension Scheme)లో చేరినవారు మరణిస్తే అతడి జీవిత భాగస్వామకి పెన్షన్‌ అందుతుంది. ఇద్దరూ మరణిస్తే నామినీకి పెన్షన్‌ నిధి చెల్లిస్తారు. ఈ స్కీమ్‌ కోసం పోస్టాఫీసులను గానీ, ఏ బ్యాంక్‌నైనా సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలనుకుంటే పీడీఆర్‌డీఏ, e-NPS వెబ్‌సైట్లను సందర్శించాలి.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...