అక్షరటుడే, ఎల్లారెడ్డి: Atal Bihari Vajpayee | మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి (Atal Bihari Vajpayee) జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అటల్ జీ చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు.

బీజేపీ వ్యవస్థాపకులుగా ఆయన పార్టీ కోసం చేసిన సేవ చిరస్మరణీయమన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశంలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేశారని పేర్కొన్నారు. ప్రధానిగా వారు ఈ దేశంలో ఎక్కువ కాలం పని చేయకపోయినా జనాల హృదయాలను గెలుచుకున్న నాయకుడిగా చిరస్మరణీయంగా మిగిలిపోయారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని దేవేందర్, పట్టణాధ్యక్షుడు రాజేశ్, మండలాధ్యక్షుడు నర్సింలు, జనరల్ సెక్రెటరీ కుచులకంటి శంకర్, ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, మాజీ అధ్యక్షుడు కుచులకంటి సతీశ్, కోశాధికారి గజానంద్, సీనియర్ నాయకులు బాలరాజ్, సత్యం సాయి రెడ్డి, వెంకట్ రెడ్డి లక్ష్మారెడ్డి సత్యం తదితరులు పాల్గొన్నారు.
Atal Bihari Vajpayee | బాన్సువాడ పట్టణంలో..
బాన్సువాడ: Atal Bihari Vajpayee | భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని బాన్సువాడలో (Banswada) నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి దేశ అభివృద్ధికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, ప్రసాద్, పైడిమలు లక్ష్మీనారాయణ, ఉమేష్, చీకట్ల రాజు, శివ శంకర్, నక్క ప్రణయ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.