అక్షరటుడే, వెబ్‌డెస్క్ : President Murmu | రాష్ట్రపతి ద్రౌపది (President Droupadi Murmu) ముర్ము ఆధ్వర్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం ఎట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సహా పలువురు నేతలు హాజరయ్యారు.
రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో (Governor Jishnu Dev Varma) కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పాల్గొన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నగర ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ముర్ము అతిథులతో ఆత్మీయంగా మాట్లాడారు.