అక్షరటుడే, వెబ్‌డెస్క్: Astrologer venu swamy | ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి Venu Swamy గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటారు. స్టార్ హీరోల జాతకాలపైనా ఒపెన్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ (famous on social media) అయ్యారు. సెలబ్రెటీల జాతకాలను చెబుతూనే సంచలనమైన వ్యాఖ్యలతో సెన్సేషన్ గా మారుతూ ఉంటారు. నాగ చైతన్య, సమంత విడాకుల విషయాన్ని ముందుగానే చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన వేణు స్వామి గతంలో వేణు స్వామి (venu swamy) టాలీవుడ్ లోని చాలా మంది హీరోయిన్లకు ప్రత్యేక పూజలు (special poojas) చేయించారు. గతంలో రష్మిక మందన్నకు (rashmikha mandana) కూడా వారింట్లో ప్రత్యేక పూజలు (special pooja) నిర్వహించారు.
Astrologer venu swamy | వేణు స్వామి కామెంట్స్..
వేణుస్వామి ఇంత వరకు బాగానే ఉన్న.. ఒక్కసారిగా సెలబ్రెటీలకు (Celebrities) సంబంధించిన నెగెటివ్ విషయాలను, భవిష్యత్ లో వారికి జరిగే ప్రమాదాలను కూడా ఓపెన్ గా చెబుతూ వస్తుంటారు. తాజాగా భారత్ – పాకిస్తాన్ యుద్ధం (india – pakistan war) జరుగుతుందని తాను ముందే చెప్పాను అని ఓ పాత వీడియోని గుర్తు చేశారు. అలాగే ఈ యుద్ధంతో ఎలాంటి పర్యవసానాలు తలెత్తుతాయో చెబుతూ సోషల్ మీడియాలో (social media) ఆయన ఒక వీడియోను (video) షేర్ చేశారు. ఉగాది పండగకు పది రోజులు ముందుగా వీడియోని షేర్ చేశాడు. గతంలో మహా భారత యుద్ధం (mahabharath war) కేవలం 5 గ్రామల కోసమే జరిగింది. అంటే భూమి కోసమే. ఇప్పుడు భారత్- పాక్ దేశాల మధ్య యుద్ధం (war between india – pakistan) కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసమే జరుగుతోంది అని చెప్పుకొచ్చాడు.
ఈ యుద్ధంతో పాకిస్తాన్ Pakistan 80 శాతం నాశనం అవుతుంది. షష్ఠ గ్రహ కూటమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తలెత్తుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరగబోతోంది. మీన రాశిలో శని, శుక్రుల కలయిక అనేది చాలా డేంజర్. పెద్ద నాయకులు, ప్రముఖులు మరణిస్తారు. ఆర్ధిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది’ అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా (video viral on social media) మారింది. ఇటీవల సోషల్ మీడియాలో తాను షేర్ చేస్తోన్న వీడియోలకు కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేస్తున్నారు వేణు స్వామి(venu swamy). ప్రస్తుతం ఈ వీడియోకు కూడా కామెంట్ సెక్షన్ ను ఆపేశారు