అక్షరటుడే, కమ్మర్పల్లి : CMRF | సీఎంఆర్ఎఫ్ (CMRF) ద్వారా అనారోగ్యంతో చికిత్స పొందిన పేదలు, మధ్యతరగతి వారికి భరోసా లభిస్తుందని టీపీసీసీ అధికార ప్రధినిధి వేణుగోపాల్ యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని హాసాకొత్తూర్లో (Hasakottur) సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు.
గ్రామంలోని చిన్నసాయన్నకు రూ. 44,000, కేలావత్ జ్యోతికి రూ.27,000, వేముల లతకు రూ.16,000, నలిమెల పద్మకు రూ.60,000, నాయిని పూర్ణిమకు రూ.8,000, రేగురి లక్ష్మీరాజ్యంకు రూ.15,000 విలువైన చెక్కులను (CMRF Cheque) అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెక్కులు మంజూరు చేయించిన బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఏనుగు మనోహర్, ఎడ్ల శ్రీకాంత్, మోహన్ నాయక్, శ్రీధర్, రాజేశ్వర్, గంగాధర్, పురుషోత్తం, ధర్మయ్య, రాజారాం, గోపిటి రాజేశ్వర్, వేముల రవి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.