అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Assistant Professors Terminated | నగరంలోని మెడికల్ కళాశాలలో (Nizamabad Medical College) అసిస్టెంట్ ప్రొఫెసర్లపై వైద్యవిధాన పరిషత్ (DME Orders) కొరడా ఝలిపించింది. ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Assistant Professors Terminated | మెడికల్ కళాశాలలో..
నగరంలోని మెడికల్ కళాశాలను 2013లో స్థాపించారు. ఎంబీబీఎస్‌లో 120సీట్లు ఉన్నాయి. జనరల్ మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీషియాలో పీజీ సీట్లు ఉన్నాయి. నీట్ యూజీ, పీజీ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికి అనుబంధంగా జిల్లా జనరల్ ఆస్పత్రి(Government General Hospital) ఉంది. జీజీహెచ్‌లో రోజుకు 1,500కు తగ్గకుండా ఓపీ పేషెంట్లు వస్తుంటారు. జిల్లా ప్రజలకే కాకుండా మహారాష్ట్ర నుంచి.. ఇతర జిల్లాల నుంచి సైతం రోగులు జీజీహెచ్‌కు వైద్యం నిమిత్తం వస్తుంటారు.
నిజామాబాద్ మెడికల్ కళాశాలలో..
నిజామాబాద్ మెడికల్ కళాశాలలో కొన్నేళ్లుగా కొందరు ప్రొఫెసర్లు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని డీఎంఈకి సమాచారం అందింది. ఈ క్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయేషా ఫరీన్, స్రవంతి, నిశిత, నీలకంఠం, సతీశ్‌రాజు, లక్ష్మణ్, అపూర్వ, లీలావతిలను తొలగిస్తూ వైద్య విద్య సంచాలకులు నరేంద్ర కుమార్ (Telangana Health Department) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
