Homeఆంధప్రదేశ్Tirupati | విద్యార్థినిని ప్రెగ్నెంట్​ చేసిన అసిస్టెంట్​ ప్రొఫెసర్​

Tirupati | విద్యార్థినిని ప్రెగ్నెంట్​ చేసిన అసిస్టెంట్​ ప్రొఫెసర్​

తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirupati | పాఠాలు చెప్పాల్సిన ఓ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ (assistant professor) కామాంధుడిగా మారాడు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన వ్యక్తి దారి తప్పాడు. బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లో (Andhra Pradesh) చోటు చేసుకుంది.

తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో (Tirupati National Sanskrit University) కీచక పర్వం నెలకొంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.లక్ష్మణ్ కుమార్ లోబర్చుకున్నాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీంతో సదరు విద్యార్థిని ప్రెగ్నెంట్​ (pregnant) అయింది. అయితే లక్ష్మణ్​కుమార్​తో విద్యార్థిని సన్నిహితంగా ఉన్న దృశ్యాలను మరో లెక్చరర్​ శేఖర్ రెడ్డి​ సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఆ వీడియోతో విద్యార్థినికి బ్లాక్ మెయిల్ చేశాడు. వీడియోలు చూపించి ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు.

Tirupati | కేసు నమోదు

బాధిత విద్యార్థిపై ఈ ఘటనపై వీసీ, రిజిస్ట్రార్​కు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. అనంతరం ప్రొఫెసర్ డా.లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఇన్​ఛార్జి వీసీ రజనీకాంత్​ తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో (Tirupati West Police Station) ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్‌లపైనా కేసు నమోదు చేశారు. వారి సెల్‌ఫోన్లు సీజ్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Tirupati | కఠిన చర్యలు అవసరం

చదువు చెప్పాల్సిన గురువులు విద్యార్థినులను (female students) వేధించడం ఇటీవల పెరిగింది. విద్యార్థుల బంగారు భవిష్యత్​కు బాటలు వేయాల్సిన పలువురు టీచర్లు దారి తప్పుతున్నారు. పాడు పనులు చేసి విద్యార్థులు జీవితాలను నాశనం చేస్తున్నారు. బడి, కాలేజీ, యూనివర్సిటీల్లో సైతం విద్యార్థినులు వేధింపులకు గురి అవుతున్నారు. ముఖ్యంగా బడుల్లో టీనేజీ పిల్లలను పలువురు ఉపాధ్యాయులు మాయమాటలతో లోబర్చుకుంటున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Must Read
Related News