అక్షరటుడే, బోధన్: Electric shock | విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మన్ (Assistant Lineman) మృతి చెందిన ఘటన బోధన్ మండలంలోని రాజీవ్‌నగర్ తండాలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లికి చెందిన మహేందర్ బోధన్ మండలంలో అసిస్టెంట్ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం రాజీవ్‌నగర్ తండాలోని (Rajivnagar Thanda) కరెంట్‌పోల్ ఎక్కాడు. అయితే కరెంట్పోల్పై 11కేవీ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై స్తంభం పైనుంచి కిందపడ్డాడు. వెంటనే స్థానికులు, తోటి సిబ్బంది అతడిని బోధన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.
