అక్షరటుడే, హైదరాబాద్: Assembly winter sessions | తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమైంది. ఈ నెల (డిసెంబరు) 29వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మద్దతుదారులను గెలిపించుకున్న జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తోంది.
మరోవైపు సర్పంచి ఎన్నికల్లో భారాస పుంజుకోవడంతో కేసీఆర్ (KCR) గత ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రెస్మీట్లో మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తే చర్చిద్దామని మీడియా చిట్‌చాట్‌లో వెల్లడించారు.
Assembly winter sessions | ప్రధానంగా వీటిపైనే..
ఈ నేపథ్యంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతోపాటు నదీ జలాల పై అసెంబ్లీలో ప్రధానంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటికితోడు జడ్జీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, PACS ఎన్నిలకపైనా చర్చ ఉండనుంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ చర్చించనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక సమావేశాల విషయానికి వస్తే.. డిసెంబర్ 30, 31 తేదీలతోపాటు జనవరి 1న అసెంబ్లీ సమావేశాలు ఉండవు, జనవరి 2వ తేదీ నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.