అక్షరటుడే, వెబ్డెస్క్: Assembly Sessions | శాసనసభ, మండలి సమావేశాలు (Assembly and Council sessions) మంగళవారం ప్రారంభమయ్యాయి. నేడు శాసనసభలో హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్-2047 పై స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు. అంతేకాకుండా జీఎస్టీ, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Assembly Sessions | ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం
శాసన సభలో (Legislative Assembly) ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల చరిత్రలోనే తొలిసారి దాదాపుగా 8 గంటల పాటు క్వశ్చన్, జీరో అవర్‌కు స్పీకర్ సమయం కేటాయించారు. ఈ ప్రశోత్తరాల సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. గతంలో ఎన్నడూ ఇంత సమయం కేటాయించలేదు. దీంతో తమ నియోజకవర్గాల పరిధిలోని సమస్యలు ప్రస్తావించడానికి అవకాశం దొరికిందని సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.