అక్షరటుడే, వెబ్‌డెస్క్: assam elephant accident | అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. ఈ రాష్ట్రంలోని హోజాయ్ జిల్లాలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఓ ఏనుగుల గుంపును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు దుర్మరణం చెందాయి. వేగం ఎక్కవగా ఉండటంతో ఇంజిన్‌తోపాటు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఏమీ కాలేదు.
శనివారం (డిసెంబరు 20, 2025) తెల్లవారుజామున సుమారు 2:17 గంటల సమయంలోఈ ప్రమాదం జరిగింది. రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఏనుగుల మృతదేహాలను తొలగించారు. రైలు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించారు.
assam elephant accident | గతంలోనూ ఘటనలు..
రైలు ప్రమాదంలో ఏనుగులు మృత్యువాత పడిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. అస్సాంలో తరచూ ఏనుగులు, వన్యప్రాణులు రైలు ప్రమాదాలా బారిన పడి అసువులు బాస్తున్నాయి. రైల్వే శాఖ, అటవీశాఖ అధికారుల సమన్వయలోపం వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారింది.