అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Himanta Biswa Sarma | బంగ్లాదేశ్ నుంచి పెరుగుతున్న అక్రమ వలసలపై అస్సాం (Assam) సీఎం హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో 40 శాతం బంగ్లాదేశీ మూలాలున్న వ్యక్తులు ఉన్నారని తెలిపారు.
దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా వచ్చి భారత్‌లో స్థిరపడుతున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఈ వలసలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 40 శాతం మంది బంగ్లా మూలాలున్న వ్యక్తులు ఉన్నారని చెప్పారు. మరో 10 శాతం వలసలు పెరిగితే అస్సాం బంగ్లాదేశ్‌లో కలిసిపోతుందన్నారు.
Himanta Biswa Sarma | ఐదేళ్లుగా..
బంగ్లా నాయకుడు హస్నత్ అబ్దుల్లా (Hasnat Abdullah) ఇటీవల భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాను అస్థిరపరిస్తే.. సెవెన్ సిస్టర్ను ముట్టడిస్తామన్నారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. అందుకే తాను గత ఐదేళ్లుగా ఈ విషయంపై గొంతు విప్పుతున్నట్లు చెప్పారు. ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్‌కు చెందిన కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజన్ పార్టీ (National Citizen Party) నాయకుడు హస్నత్ అబ్దుల్లా న్యూఢిల్లీ బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే, ఢాకా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను “వేరుచేసి”, వేర్పాటువాద శక్తులకు మద్దతు ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి.
ముస్లిం జనాభా 50 శాతానికి మించితే అస్సాంలోని ఇతర వర్గాలు మనుగడ సాగించలేవని హిమంత పేర్కొన్నారు. అజెండా ఆజ్‌తక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, దశాబ్దాలుగా అనియంత్రిత వలసల కారణంగా స్థానిక అస్సామీ జనాభా మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. 2021లో సుమారు 38 శాతంగా ఉన్న అస్సాం ముస్లిం జనాభా 2027 నాటికి 40 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు.