HomeUncategorizedAssam CM | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్లకు OBC...

Assam CM | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్లకు OBC హోదా ప్రకటన

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Assam CM | అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ(CM Himanta Biswa Sarma) ఈ రోజు ఒక కీలక ప్రకటన చేస్తూ.. ట్రాన్స్‌జెండర్స్‌కి ఓబీసీ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ట్రాన్స్‌జెండర్స్‌కి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ల‌భించేందుకు మార్గం సుగ‌మం చేసిన‌ట్టు అవుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లు(Transgenders) చాలా కాలంగా సామాజిక, ఆర్థికంగా వెన‌క‌బ‌డి ఉన్నారు. వారిని సమాన హక్కులతో ముందుకు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత, అని తెలిపారు.

Assam CM | గొప్ప నిర్ణ‌యం..

ఈ హోదాతో ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ పథకాల్లో (Government Schemes) ప్రాధాన్యం లభించనుంది. వారి జీవన ప్రమాణాలు మెరుగవడం ద్వారా మౌలిక హక్కులను పరిరక్షించే ప్రయత్నంగా ఇది అభివృద్ధి చెందుతుంది. ఇది ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న వారికి ఒక విజయంగా చెప్పుకోవ‌చ్చు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సామాజిక కార్యకర్తలు, హక్కుల సంఘాలు సీఎం నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇది ట్రాన్స్‌జెండర్ సమాజానికి కేవలం గుర్తింపు మాత్రమే కాదు, వారిని సమానంగా చూడాలన్న సంకల్పానికి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని సంబంధిత శాఖలు త్వరలోనే దీనికి సంబంధించి కార్యనిర్వహణ మార్గదర్శకాలు విడుదల చేయనున్నాయని అధికారులు తెలిపారు. ఇది న్యాయ సమాజ నిర్మాణంలో గొప్ప‌ అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం Assam CM మరో కీలక ప్రకటనగా, మహిళా మరియు బాల సంక్షేమ శాఖ(Child Welfare Department)లో ఉన్న అన్ని సూపర్​ వైజర్​ స్థాయి పదవులలో 50% రిజర్వేషన్ ప్రకటించారు. ఈ పదవులు ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) పథకం ద్వారా యావత్తు దేశంలో అంగన్‌వాడీ కార్మికుల(Anganwadi workers) కీలక ప్రాముఖ్య‌త‌ను గుర్తిస్తూ, వారి బాధ్యతలు మరింత బలపడతాయని వివరించారు.

Must Read
Related News