ePaper
More
    HomeజాతీయంBrahmaputra River | బ్రహ్మపుత్ర నదిపై పాక్​ ప్రచారానికి అస్సాం సీఎం కౌంటర్​

    Brahmaputra River | బ్రహ్మపుత్ర నదిపై పాక్​ ప్రచారానికి అస్సాం సీఎం కౌంటర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brahmaputra River | పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత భారత్​ పాక్(Pakistan)​తో వాణిజ్యం సహా పలు కీలక ఒప్పందాలు రద్దు చేసుకుంది. ఇందులో భాగంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో సింధూ నది జలాలు పాక్​కు వెళ్లకుండా భారత్(India)​ మళ్లిస్తోంది. దీంతో ఆ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. ఆ దేశంలో సాగు, తాగునీటి అవసరాలకు సింధూ నది కీలకం. అయితే సింధూ జలాలను ఆపడంతో పాక్​కు ఎం చేయాలో తోచక తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతోంది.

    భారత్​ సింధూ నది(Sindhu River) జలాలు ఆపడంతో భారత్​కు చైనా బ్రహ్మపుత్ర నది(Brahmaputra River) జలాలను ఆపుతుందని ఇటీవల పాక్​ సోషల్​ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై చైనా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ మిత్రదేశం చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపితే భారత్ ఇబ్బందులు పడుతుందని పాక్​ భావిస్తోంది. అయితే దీనికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ(Assam CM Himanta Biswas Sharma) కౌంటర్​ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్​ పెట్టారు. చైనా నుంచి కాకుండా బ్రహ్మపుత్ర నదికి భారత్​లోని ఉపనదుల ద్వారానే అధిక వరద వస్తోందని ఆయన తెలిపారు. చైనా నీటిని ఆపినా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

    చైనా నుంచి 30-35శాతం జలాలు మాత్రమే వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక మిగిలిన వరద అంతా అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, నాగాలాండ్‌, మేఘాలయాలో రుతుపవనాల వల్ల కురిసే వర్షాలతో చేరుతుందని ఆయన వివరించారు. బ్రహ్మపుత్ర(Brahmaputra) జలాల కోసం భారత్‌ ఎగువ నుంచి వచ్చే ప్రవాహం కోసం ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అది వర్షాధారిత భారత నది అని పేర్కొన్నారు. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే అది భారత్​కే మేలు చేస్తుందన్నారు. దీంతో అస్సాంలో ఏటా వచ్చే వరదలు తగ్గిపోతాయన్నారు.

    సెంటర్‌ ఫర్‌ చైనా అండ్‌ గ్లోబలైజేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్టర్‌ జికాయ్‌ గావ్‌(Victor Jikai Gaon) ఇటీవల భారత్‌ సింధూజలాలను నిలిపివేయడంపై స్పందిస్తూ.. బ్రహ్మపుత్ర నది నుంచి నీరు భారత్‌కు వెళ్లకుండా చైనా(China) ఆపగలదని పేర్కొన్నాడు. ఈ అంశాన్ని పాక్‌ మీడియా ప్రచారంలోకి తెచ్చింది. అయితే అధికారికంగా చైనా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...