అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ప్రారంభం అయ్యాయి. తొలి రోజు సీఎం కేసీఆర్ సభకు హాజరై రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి సభలో కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. సభ అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు.
కేసీఆర్‌ను (KCR) కలవడం ఇది మొదటిసారి కాదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశానని చెప్పారు. నేను, కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలు అక్కడే అడగాలన్నారు. కేసీఆర్ సభ నుంచి వెంటనే ఎందుకు వెళ్లిపోయారో అనేది ఆయననే అడగాలన్నారు. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించానని సీఎం తెలిపారు. ప్రతి సభ్యుడిని తాము గౌరవిస్తామన్నారు.
CM Revanth Reddy | సభ ముందుకు కీలక బిల్లులు
అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధి పెంపు, వార్డుల విభజన జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ తదితర అంశాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీరో అవర్ (Zero Hour) అనంతరం సభను జనవరి 2కు వాయిదా వేశారు.