Homeబిజినెస్​Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Asian markets mixed | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asian markets mixed : యూఎస్‌, యూరోప్‌(Europe) మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ పాజిటివ్‌గా కొనసాగుతోంది.

Asian markets mixed : యూఎస్‌ మార్కెట్లు..

వివిధ దేశాలపై యూఎస్‌ విధించిన టారిఫ్స్‌(Tariffs) వల్ల ధరలు పెరుగుతున్నాయి. ఇది వాల్‌స్ట్రీట్‌ ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతోంది. దీంతో గత ట్రేడింగ్ సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 1.15 శాతం, ఎస్‌అండ్‌పీ 0.64 శాతం నష్టపోయాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.11 శాతం లాభంతో సాగుతోంది.

Asian markets mixed : యూరోప్‌ మార్కెట్లు..

సీఏసీ 0.76 శాతం, డీఏఎక్స్‌ 0.58 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.32 శాతం నష్టంతో ముగిశాయి.

Asian markets mixed : ఆసియా మార్కెట్లు..

ఆసియా మార్కెట్లు సోమవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో హాంగ్‌సెంగ్‌(Hang Seng) 2.29 శాతం, షాంఘై 0.22 శాతం లాభాలతో ఉండగా.. నిక్కీ 2.11 శాతం, కోస్పీ 0.74 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.66 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.21 శాతం నష్టంతో ఉన్నాయి.

గ్లోబల్‌ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్‌, చైనా మధ్య సంబంధాల విషయంలో ఇన్వెస్టర్లు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.22 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈ రోజూ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐలు వరుసగా ఐదోరోజూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత ట్రేడింగ్ సెషన్‌లో నికరంగా రూ. 8,312 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు నాలుగో రోజూ నికరంగా రూ. 11,487 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.86 నుంచి 0.71 కి పడిపోయింది. విక్స్‌(VIX) 3.49 శాతం తగ్గి 11.75 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.36 శాతం తగ్గి 67.26 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 57 పైసలు బలహీనపడి 88.20 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.23 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.73 వద్ద కొనసాగుతున్నాయి.

ఈవారంలో ఆటో సేల్స్‌(Auto sales) డాటా విడుదల కానుంది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశాలున్నాయి. వీటితోపాటు భారత్‌పై యూఎస్‌ సుంకాల ప్రభావం, ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం తదితర అంశాలపై మార్కెట్‌ గమనం ఆధాపడనుంది.

ఏప్రిల్‌నుంచి జూన్‌ మధ్య కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత ఐదు త్రైమాసికాలతో పోల్చితే అత్యంత వేగంగా వృద్ధి చెందింది. ఈ త్రైమాసికంలో జీడీపీ(GDP) 7.4 శాతంనుంచి 7.8 శాతానికి చేరింది. ఇది అంచనాలకు మించి ఉండడం గమనార్హం. ఇది సానుకూలాంశం.

ఆర్థిక లోటు గతేడాది ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంతో పోల్చితే ఈసారి రెట్టింపు అయ్యింది. గత సంవత్సరం 2.77 లక్షల కోట్లుగా ఉన్న ఆర్థిక లోటు ఈసారి 4.68 లక్షల కోట్లకు పెరిగింది. గత ట్రేడిరగ్‌ సెషన్‌లో రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఇవి ఆందోళన కలిగించే అంశాలు.

ట్రంప్‌ విధించిన సుంకాలలో ఎక్కువ భాగం చట్ట విరుద్ధమని, ఇవి అనేక మంది వాణిజ్య భాగస్వాములను ప్రభావితం చేశాయని యూఎస్‌ ఫెడరల్‌ అప్పీల్‌ కోర్ట్‌ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు తన అధికారాన్ని అతిక్రమించారని పేర్కొంది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి వీలుగా అక్టోబర్‌ 14 వరకు రెసిప్రోకల్‌ టారిఫ్స్‌ అమలులో ఉండడానికి అనుమతించింది.

షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. సరిహద్దు ఉద్రిక్తతలపై ఇరువురూ మాట్లాడుకోవడమే కాకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అంగీకరించారు. ఇది మన మార్కెట్లకు సానుకూలాంశం.