ePaper
More
    Homeబిజినెస్​Pre market analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ టు పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న...

    Pre market analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు.. ఫ్లాట్‌ టు పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pre market analysis | వాల్‌స్ట్రీట్‌(Wallstreet) ఆల్‌టైం హైస్‌ వద్ద కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు(Asia markets) ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంది.

    Pre market analysis | యూఎస్‌ మార్కెట్లు..

    గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ(S&P) 0.30 శాతం, నాస్‌డాక్‌ 0.03 శాతం పెరిగాయి. డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.11 శాతం లాభంతో సాగుతోంది.

    Pre market analysis | యూరోప్‌ మార్కెట్లు..

    డీఏఎక్స్‌ 0.36 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 0.19 శాతం తగ్గగా.. సీఏసీ 0.15 శాతం లాభంతో ముగిసింది.

    Pre market analysis | ఆసియా మార్కెట్లు..

    ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.05 శాతం, నిక్కీ 0.96 శాతం, షాంఘై 0.15 శాతం, కోస్పీ 0.09 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.03 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ 0.84 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.05 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌ టు గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre market analysis | గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐలు మళ్లీ నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 115 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మారు. డీఐఐ(DII)లు పన్నెండో రోజు నికరంగా రూ. 5,004 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.08 నుంచి 1.15 కు పెరిగింది. విక్స్‌(VIX) 1.38 శాతం తగ్గి 10.54 వద్ద ఉంది. పీసీఆర్‌ పెరగడం, విక్స్‌ తగ్గడం బుల్స్‌కు అనుకూలాంశం.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 67.52 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 2 పైసలు బలపడి 88.10 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.06 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.86 వద్ద కొనసాగుతున్నాయి.
    • యూఎస్‌లో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ క్రియాశీలకంగా ఉందని, న్యూజిలాండ్‌తోపాటు యూరోపియన్‌ యూనియన్‌తోనూ చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య,
    • పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఇది మన మార్కెట్‌కు సానుకూలాంశం.

    More like this

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...

    Nepal | నేపాల్‌లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల స‌డ‌లింపు.. ర‌ద్దీగా మారిన మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నిర‌స‌న‌ల‌తో అట్టుడికిన నేపాల్‌లో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. రెండ్రోజుల పాటు విధ్వంసంతో...

    Sushila Karki | తాత్కాలిక ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెడీ.. నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌న్న సుశీల క‌ర్కి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sushila Karki | నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని జెన్‌-జి చేసిన‌ ప్రతిపాదన‌కు...