
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asian markets in gains | దాదాపు పది నెలల తర్వాత యూఎస్ ఫెడ్(US Fed) తొలిసారి రేట్ కట్‌ను ప్రకటించింది. 25 బేసిస్ పాయింట్ల(Basis points) మేర వడ్డీ రేట్లను తగ్గించింది.
ఈ ఏడాది మరో రెండు రేట్ కట్‌లు(Rate cuts) ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే యూఎస్ ఫెడ్ 25 బేసిస్ పాయింట్లను కట్ చేస్తుందని మార్కెట్ ముందే అంచనా వేసింది.
అంచనాలకు మించి వడ్డీల కోత లేకపోవడంతో వాల్‌స్ట్రీట్(Wallstreet) ఇన్వెస్టర్లు నిరాశ చెందారు. దీంతో యూఎస్ మార్కెట్లు గత సెషన్‌లో నష్టాలతో ముగిశాయి.
యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సైతం పాజిటివ్‌గా ఉంది.
Asian markets in gains | యూఎస్ మార్కెట్లు (US markets)..
గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ(S&P) 0.13 శాతం, నాస్‌డాక్ 0.07 శాతం నష్టపోయాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.29 శాతం లాభంతో సాగుతోంది.
Asian markets in gains | యూరోప్ మార్కెట్లు (European markets)..
ఎఫ్‌టీఎస్‌ఈ 0.14 శాతం, డీఏఎక్స్ 0.13 శాతం లాభాలతో ముగియగా.. సీఏసీ 0.40 శాతం నష్టపోయింది.
Asian markets in gains | ఆసియా మార్కెట్లు (Asian markets)..
గురువారం ఉదయం ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో నిక్కీ(Nekkei) 1.07 శాతం, కోస్పీ 0.99 శాతం, హాంగ్‌సెంగ్ 0.25 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.18 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.05 శాతం, షాంఘై 0.60 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
గిఫ్ట్ నిఫ్(Gift nifty)టీ 0.38 శాతం లాభంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 1,124 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐ(DII)లు వరుసగా పదిహేడో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 2,293 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.29 నుంచి 1.21 కు పడిపోయింది. విక్స్(VIX) 0.24 శాతం తగ్గి 10.25 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 67.70 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 26 పైసలు బలపడి 87.81 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.08 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 96.99 వద్ద కొనసాగుతున్నాయి.