అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre markets analysis | ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు(Asian stock markets) లాభాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gifty nifty) సైతం లాభాల బాటలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre markets analysis | యూఎస్ మార్కెట్లు..
వాల్‌స్ట్రీట్ నాలుగు సెషన్ల తర్వాత కోలుకుంది. ఎస్‌అండ్‌పీ, డౌ లాభాలతో ముగిశాయి. గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.19 శాతం పెరగ్గా.. నాస్‌డాక్(Nasdaq) మాత్రం 0.08 శాతం నష్టపోయింది. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
Pre markets analysis | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 0.56 శాతం, డీఏఎక్స్(DAX) 0.20 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.20 శాతం లాభపడ్డాయి.
Pre markets analysis | ఆసియా మార్కెట్లు..
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 2.77 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.54 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.44 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.87 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.52 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(HangSeng) 0.39 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.26 శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre markets analysis | గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐ()FIIలు ఎనిమిది సెషన్ల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 289.80 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. డీఐఐలు వరుసగా 89వ రోజు నికర కొనుగోలుదారులుగా ఉండి రూ. 677 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.13 నుంచి 1.46 కు పెరిగింది.
విక్స్(VIX) గత సెషన్‌లో 2,89 శాతం పెరిగి 9.45 వద్ద ఉంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు బలహీనపడి 90.19 వద్ద నిలిచింది.
యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.18 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.60 వద్ద కొనసాగుతున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60.77 డాలర్ల వద్ద ఉంది.
రష్యానుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌పై కొత్త సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది. దీంతో మన మార్కెట్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి.
