Homeబిజినెస్​Pre Market analysis | జోష్‌లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre Market analysis | జోష్‌లో ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre Market analysis | గ్లోబల్‌ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దాదాపు అన్ని దేశాల ప్రధాన మార్కెట్లు నష్టాలతో ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయి.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market analysis | గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దాదాపు అన్ని దేశాల ప్రధాన మార్కెట్లు నష్టాలతో ఉన్నా.. మన మార్కెట్లు మాత్రం భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయి.

యూఎస్‌, యూరోపియన్‌ (European) మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే యూఎస్‌, భారత్‌ల మధ్య ట్రేడ్‌ డీల్‌పై ఆశలతో గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) మాత్రం భారీ లాభాలతో ఉంది.

Pre Market analysis | యూఎస్‌ మార్కెట్లు (US markets)..

అమెరికా, చైనా(China) మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తోడు కంపెనీల క్యూ3 ఎర్నింగ్స్‌ మిక్స్‌డ్‌గా ఉండడంతో వాల్‌స్ట్రీట్‌ (Wallstreet) లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 0.93 శాతం, ఎస్‌అండ్‌పీ 0.53 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ సైతం 0.08 శాతం నష్టంతో ఉంది.

అనలిస్టుల అంచనాలకు తగ్గట్లుగా లాభాలు రాకపోవడడంతో టెస్లా(Tesla) షేరు ధర 3.80 శాతం పతనమైంది. గత సెషన్‌లో అడ్వాన్స్‌డ్‌ మైక్రో డివైజెస్‌ షేరు ధర 3.28 శాతం, ఎన్వీడియా షేరు ధర 0.49 శాతం తగ్గాయి.

Pre Market analysis | యూరోప్‌ మార్కెట్లు (European markets)..

ఎఫ్‌టీఎస్‌ఈ 0.92 శాతం పెరగ్గా.. డీఏఎక్స్‌(DAX) 0.74 శాతం, సీఏసీ 0.63 శాతం నష్టపోయాయి.

Pre Market analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..

ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 7.50 గంటల సమయంలో నష్టాలతో సాగుతున్నాయి. సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.12 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.08 శాతం లాభాలతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 1.31 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.81 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.56 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.30 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 1.29 శాతం లాభంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు భారీ గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా మూడో సెషన్‌లో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. నికరంగా రూ. 96 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు. డీఐఐలు 39 సెషన్‌ల తర్వాత తొలిసారి నికర అమ్మకందారులుగా మారారు. గత సెషన్‌లో రూ. 607 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.08 నుంచి 1.15 కు తగ్గింది. విక్స్‌(VIX) 0.51 శాతం తగ్గి 11.30 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.05 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలహీనపడి 87.93 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 3.96 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 99.01 వద్ద కొనసాగుతున్నాయి.

భారత్‌, యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందం(Trade deal) కీలక దశకు చేరుకోవడంతో మన ఎగుమతులపై అమెరికా సుంకాలను 50 శాతంనుంచి 15 శాతానికి తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. ఇది మన మార్కెట్లకు సానుకూలాంశం.

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికాకు చైనా రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ ఎగుమతులను తగ్గించినందుకు ప్రతీకారంగా.. ల్యాప్‌టాప్‌ల నుంచి జెట్‌ ఇంజిన్‌ల వరకు చైనాకు సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ఎగుమతులను అరికట్టే ప్రణాళికను ట్రంప్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.