అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup Trophy | ఆసియా కప్ 2025లో Aisa Cup 2025 పాకిస్థాన్‌పై విజయం సాధించి కప్ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా ఇప్పటికీ ఆ ట్రోఫీని అందుకోలేదు.
దాదాపు నెలరోజులు గడిచినా కూడా కప్ భారత జట్టుకు చేరకపోవడంతో ఈ విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council -ACC) చైర్మన్ నజమ్ నఖ్వీ ఎట్టకేలకు ట్రోఫీని భారత్‌కు అప్పగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆగస్ట్ నెలలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్‌ను ఓడించి ఘనవిజయం సాధించింది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్‌హాండ్ చేయడానికే ఆసక్తి చూపలేదు.
అదే కారణంగా ఏసీసీ చీఫ్ నజమ్ నఖ్వీ ACC Chief Najam Naqvi చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడాన్ని టీమ్‌ఇండియా స్పష్టంగా నిరాకరించింది. దీంతో నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను తనతో తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది.
Asia Cup Trophy | బీసీసీఐ సీరియస్
దాదాపు నెల గడుస్తున్నా ట్రోఫీ అందకపోవడంతో బీసీసీఐ (BCCI) సెక్రటరీ దేవజిత్ సైకియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఆసియా కప్ ట్రోఫీని వెంటనే భారత్‌కు అందించాలి,” అంటూ ఏసీసీకి లేఖ రాశారు.
నవంబర్ 4న జరగబోయే ఐసీసీ త్రైమాసిక సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రస్తావిస్తామని కూడా హెచ్చరించారు. ఈ ఒత్తిడి నేపథ్యంలో నఖ్వీ మెట్టుదిగి ట్రోఫీని భారత్‌కు పంపేందుకు అంగీకరించినట్లు సమాచారం.
“ఒకటి లేదా రెండు రోజుల్లో ట్రోఫీ ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి చేరుతుంది,” అని సైకియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసీసీ ఫిర్యాదు భయంతోనే నఖ్వీ వెనక్కి తగ్గినట్లు వర్గాల సమాచారం.
ఆసియా కప్‌లో పాక్‌పై భారత్ మూడు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించి దాదాపు ఏకపక్షంగా ట్రోఫీని Trophy కైవసం చేసుకుంది.
కానీ ఫైనల్ తర్వాత నఖ్వీ ప్రవర్తన క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రోఫీని తీసుకెళ్లి ఇంతవరకు ఇవ్వకపోవడం, మెడల్స్‌ను కూడా ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకోవడం పాకిస్థాన్ ఆధ్వర్యంలోని ఏసీసీ పక్షపాత ధోరణిగా బీసీసీఐ భావిస్తోంది.
