ePaper
More
    Homeక్రీడలుAsia Cup | క్రికెట్ పండుగ మళ్లీ మొదలైంది.. నేటి నుంచి ఆసియా కప్.. లైవ్...

    Asia Cup | క్రికెట్ పండుగ మళ్లీ మొదలైంది.. నేటి నుంచి ఆసియా కప్.. లైవ్ డీటెయిల్స్, ఫుల్ షెడ్యూల్ ఇదిగో!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కి అబుదాబి మరియు దుబాయ్(Abu Dhabi and Dubai) వేదికలుగా నిలవనున్నాయి.

    ఆసియాలోని మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గత టోర్నీ విజేతగా ఉన్న టీమిండియా(Team India) ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాతో బరిలోకి దిగుతోంది.

    Asia Cup | టోర్నీ వివరాలు:

    • ఆరంభ తేదీ: సెప్టెంబర్ 9, 2025
    • ఫైనల్: సెప్టెంబర్ 28, 2025 – దుబాయ్‌లో
    • మ్యాచ్‌లు మొదలయ్యే సమయం: రాత్రి 8:00 గంటలకు
      (యూఏఈ vs ఒమన్ మ్యాచ్ మాత్రమే సాయంత్రం 5:30కి)
    • తొలి మ్యాచ్:
    • అప్ఘనిస్తాన్ vs హాంకాంగ్ – సెప్టెంబర్ 9, అబుదాబి, రాత్రి 8 గంటలకు
    • టీమిండియా తొలి మ్యాచ్: సెప్టెంబర్ 10 – యూఏఈతో
    • భారత్ vs పాక్ హై ఓల్టేజ్ క్లాష్: సెప్టెంబర్ 14
    • గ్రూపులు:
    • గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్

    గ్రూప్ B లో శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, హాంకాంగ్

    Asia Cup | ప్రసార హక్కులు:

    • టీవీలో: Sony Sports Network
    • డిజిటల్లో: Sony LIV App లేదా వెబ్‌సైట్
    • బహుమతులు (ప్రైజ్ మనీ):
    • విజేత జట్టు: $300,000 (రూ.2.6 కోట్లు దాదాపు)
    • రన్నరప్: రూ.1.3 కోట్లు
    • 3వ స్థానం: రూ.80 లక్షలు
    • 4వ స్థానం: రూ.60 లక్షలు
    • (2022లో కంటే 50% ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు)
    • టీమిండియా జట్టు (India Squad):

    కెప్టెన్ : సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) , వైస్ కెప్టెన్: శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.

    రిజర్వ్ ప్లేయర్లు : ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్

    ఈసారి ఆసియా కప్(Asia Cup) మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ – పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీ ఫేవరెట్ జట్టుకు సపోర్ట్ చేయండి , క్రికెట్ పండుగను ఎంజాయ్ చేయండి!

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...