Homeక్రీడలుAsia Cup | నేడే ఆసియాకప్‌ ఫైనల్‌ : జోరుమీదున్న టీమిండియా, ఒత్తిడిలో పాకిస్థాన్

Asia Cup | నేడే ఆసియాకప్‌ ఫైనల్‌ : జోరుమీదున్న టీమిండియా, ఒత్తిడిలో పాకిస్థాన్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | దుబాయ్‌ వేదికగా ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ (Ind vs Pak) మధ్య ఆఖరి పోరు జరుగ‌నుంది. ఈ మహా సమరానికి భారత జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతుంటే, పాకిస్థాన్‌ మాత్రం తమ పర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాల‌నే ధృఢ సంకల్పంతో కాలు మోపుతోంది. 1984లో మొదలైన ఆసియా కప్‌ ట్రోఫీలో ఇప్పటివరకు 8 సార్లు టైటిల్‌ను గెలుచుకున్న భారత్‌ ఇప్పటికీ బలంగా ఉంది. ఈసారి తొమ్మిదో టైటిల్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా, టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకెళ్తోంది.

Asia Cup | హోరా హోరీ..

రీసెంట్‌గా జ‌రిగిన‌ శ్రీలంక (Srilanka) మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శన బాగుంది. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌, బౌలింగ్ ప‌రంగా స్ట్రాంగ్‌గానే ఉంది. బుమ్రా పునరాగమనం, దూబే బౌలింగ్ కూడా జ‌ట్టుకి బలాన్ని ఇస్తుంది.. స్పిన్‌ యంత్రాంగంగా కుల్దీప్‌, వరుణ్ ఉన్నారు. వారిద్ద‌రు మ్యాచ్‌ను మ‌లుపు తిప్పగ‌ల‌రు. ఇక ఈ టోర్నీలో ఆకట్టుకుంటున్న పేరు అభిషేక్‌ శర్మ (Abhishek Sharma). వరుసగా హ్యాట్రిక్‌ హాఫ్‌సెంచరీలతో టాప్‌ఆర్డర్‌లో తన స్థానం పటిష్టం చేసుకున్నాడు. గిల్‌ తడబడుతున్నా, అభిషేక్‌ మెరుపులు భారత్‌కు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాయి. పాక్‌తో ఫైనల్లోనూ అతడి ఆటతీరే కీలకంగా మారబోతోంది.

పాక్‌ టోర్నీలో స్థిరంగా రాణించకపోయినా, అదృష్టం క‌లిసి వచ్చి ఫైనల్‌ చేరింది. హరిస్‌ రవూఫ్‌, షాహీన్‌ అఫ్రిది లాంటి పేసర్లు భారత్ జ‌ట్టుని కాస్త ఇబ్బంది పెట్ట‌గ‌ల‌రు. అయితే గత రికార్డులు చూస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. పాక్‌తో జరిగిన 15 టీ20ల్లో 12 మ్యాచ్‌లు గెలవడం ద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. భారత్‌-పాక్‌ పోరు ఎప్పుడూ హాట్‌టాపిక్‌. ఈసారి కూడా టికెట్లు ఇప్పటికే సోల్డ్ అవుట్‌. టీవీ, మొబైల్‌లో మ్యాచ్‌ను చూడాలన్న ఉత్సాహం ప్రజల్లో తారస్థాయికి చేరింది. మొత్తంగా భారత్‌కు ఇది మరో టైటిల్ ద‌క్కించుకునే అవకాశం. పాక్‌ (Pakistan) గట్టి పోటీనిచ్చినా, భారత జట్టు మెంటల్‌ ప్రిపరేషన్‌, ప్రస్తుత ఫామ్‌, రికార్డులు చూస్తే మనదే పైచేయి అన్నది స్పష్టంగా వినిపిస్తోంది. దసరా పండుగ స‌మ‌యంలో మ‌న‌ జట్టు విజయం సాధిస్తే, అదే నిజమైన ఉత్సవంగా మారనుంది.

Must Read
Related News