అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 ఫైనల్ రేసు ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారింది. సూపర్-4లో టీమ్స్ మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారడంతో అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇప్పటికే సూపర్ 4లో మూడు మ్యాచ్‌లు పూర్తవగా.. ఇంకో మూడు మ్యాచ్‌ల ఫలితాలను బట్టి టోర్నమెంట్ ఫైనల్లో ఎవరు ఆడతారనేది క్లారిటీ వస్తుంది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం (Dubai International Stadium) వేదికగా జరుగనున్న భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ టీమిండియాకు (Team India) చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. ఇప్పటివరకు ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్, ఈరోజు కూడా గెలిచి ఫైనల్ టికెట్‌ను ఖాయంగా చేసుకోవాలని చూస్తోంది.
Asia Cup | ఎవరు ఫైనల్‌కి..
ఇదిలా ఉండగా, భారత్ గెలిస్తే శ్రీలంక (Srilanka) అధికారికంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించనుంది. తద్వారా సెప్టెంబర్ 26న జరిగే భారత్ vs శ్రీలంక మ్యాచ్ కేవలం నామమాత్రపు మ్యాచ్‌గా మిగిలిపోతుంది. పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఈ రోజు భారత్ గెలవాలని కోరుకుంటున్నారు. ఈ రోజు భారత్ గెలిచి సెప్టెంబర్ 25న జరిగే పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే ఫైనల్‌కు పాకిస్తాన్ చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్‌ను ఓడించడం పెద్ద కష్టం ఏమి కాదు అనే నమ్మకంతో ఉన్నారు పాకిస్తాన్ ఉంది. ఒకవేళ నేడు బంగ్లాదేశ్ భారత్‌ను ఓడిస్తే, ఆ జట్టుకి ఫైనల్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
సెప్టెంబర్ 25న జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్(Pakistan)పై కూడా గెలిస్తే, ఫైనల్ టికెట్ లాంఛనంగా దక్కుతుంది. కానీ పాకిస్తాన్‌పై ఓడిపోతే, తుది ఫలితం భారత్ vs శ్రీలంక మ్యాచ్ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మూడు జట్లు (భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్/పాకిస్తాన్) అన్ని 2 పాయింట్లతో సమంగా నిలిస్తే, టోర్నమెంట్ ఫైనల్‌కు వెళ్లే జట్లను నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఒక్క పరాజయం కూడా ఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Asia Cup | మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్..
- సెప్టెంబర్ 24 – భారత్ vs బంగ్లాదేశ్
- సెప్టెంబర్ 25 – పాకిస్తాన్ vs బంగ్లాదేశ్
- సెప్టెంబర్ 26 – భారత్ vs శ్రీలంక
ఆసియా కప్ 2025 టోర్నీలో చివరి దశకు చేరుతున్న తరుణంలో, ఒక్కో బంతి ఫైనల్ చేరే మార్గాన్ని నిర్ణయించనుంది. నేటి భారత్ vs బంగ్లాదేశ్ (Bangladesh) మ్యాచ్ ఫలితమే ఫైనల్ కోసం జరిగే పోరుకు కీలకం కావొచ్చు. ఫైనల్ ఎవరు చేరుకుంటారా అని అభిమానులు ఊపిరి బిగబట్టి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.