అక్షరటుడే, వెబ్‌డెస్క్: Asia Cup | మరి కొద్ది రోజులలో ఆసియా కప్ (Asia Cup) షెడ్యూల్ మొదలు కానుండగా, ఈ టోర్నీకి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ విడుదలైంది. ఈసారి టోర్నమెంట్ యూఏఈ (UAE) వేదికగా జరగనుండగా, అక్కడి వేడి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు చేశారు.
సాధారణంగా ఈ మ్యాచ్‌లు యూఏఈ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, పగటిపూట విపరీతమైన వేడి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. అంటే సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభించాలని నిర్ణయించారు.
Asia Cup | టీ 20 ఫార్మాట్‌లో..
ఆసియా కప్ ఈసారి టీ20 ఫార్మాట్‌లో (T20 Format) నిర్వహిస్తున్నారు. భారత టైమింగ్స్ (India Timings) ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌లో యూఏఈలో ఉష్ణోగ్రత దాదాపు 40 డిగ్రీలకి పైగానే ఉంటుంది. ఆటగాళ్లు వేడి నుంచి ఉపశమనం పొందడానికి మ్యాచ్ సమయాన్ని కాస్త పెంచారు. ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లలో 18 మ్యాచ్‌ల సమయాన్ని అరగంట పెంచారు. సెప్టెంబర్ 15న జరగనున్న యూఏఈ vs ఒమన్ మ్యాచ్ మాత్రం దీనికి మినహాయింపు. ఈ మ్యాచ్ పగటి పూట జరగనుంది. అంటే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఆసియా కప్ 2026లో జరగనున్న టీ 20 వరల్డ్ కప్‌కు (T20 World Cup) రిహార్సల్ లాంటిది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఎనిమిది జట్లలో ఐదు జట్లు (ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్) వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఆడనున్నాయి. ఇండియా ఈ సారి గ్రూప్ Aలో ఉండగా పాకిస్తాన్ (Pakistan), యూఏఈ, ఒమన్ కూడా అదే గ్రూప్‌లో ఉన్నాయి.
ఇండియా సెప్టెంబర్ 10న యూఏఈతో మొదటి మ్యాచ్ ఆడనుంది. అయితే హై ఓల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాక్ (IND vs PAK) ప్టెంబర్ 14న జరగబోతోంది. ఇక గ్రూప్ దశలో ఇండియా చివరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో ఆడనుంది. ఈ సారి టీమిండియా యువ జట్టుతో బరిలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.