ePaper
More
    Homeక్రీడలుAisa Cup | మ‌రో నాలుగు రోజుల‌లో ఆసియా కప్ 2025.. ట్రోఫీ గెలిచిన జ‌ట్టుకి...

    Aisa Cup | మ‌రో నాలుగు రోజుల‌లో ఆసియా కప్ 2025.. ట్రోఫీ గెలిచిన జ‌ట్టుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aisa Cup | ఆసియా కప్ 2025కి (Asia Cup 2025) రంగం సిద్ధమైంది. ఈసారి సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates)(UAE) వేదికగా టోర్నీ జరగనుంది. ఎనిమిది జట్లు టైటిల్ కోసం తలపడనున్న ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఆసియా క్రికెట్ అభిమానుల (Asian cricket fans) కోసం మళ్లీ ఆసక్తికర సమరానికి ముహూర్తం ఖరారైంది. ఈసారి పోటీకి ఎనిమిది జట్లు రెండుగ్రూపులుగా విభజించబడ్డాయి

    • గ్రూప్ A: భారతదేశం ,పాకిస్తాన్ ,యూఏఈ , ఒమన్
    • గ్రూప్ B: శ్రీలంక , బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్

    ప్రతి జట్టు గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్‌లో టాప్ 2 జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టాప్ 2 జట్లు ఫైనల్‌కు దూసుకెళ్తాయి.

    Aisa Cup | బంపర్ ప్రైజ్ మనీ:

    ఈసారి ప్రైజ్ మనీ మరింత పెంచారు.

    • విజేత జట్టుకు: ₹2.6 కోట్లు
    • రన్నరప్ జట్టుకు: ₹1.3 కోట్లు

    మిగిలిన జట్లలో మూడవ, నాలుగవ స్థానాల్లో నిలిచిన జట్లకూ గణనీయమైన ప్రైజ్ మనీ (prize money) ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ టోర్నీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఈసారి భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా (Suryakumar Yadav), శుభమన్ గిల్ (Shubman Gill) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. యువ ఆటగాళ్లతో కూడిన సత్తా ఉన్న బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేసింది.

    • బ్యాట్స్‌మెన్: శుభమన్ గిల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ
    • ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్
    • వికెట్ కీపర్లు: జితేష్ శర్మ, సంజు శాంసన్
    • బౌలర్లు: బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా

    Aisa Cup | బ్లాంక్ జెర్సీలో బరిలోకి టీమిండియా!

    ఈసారి ఆసియా కప్‌లో టీమిండియా (Team India) స్పాన్సర్‌ లేకుండా బ్లాంక్ జెర్సీలో బరిలోకి దిగనుంది. దీనికి కారణం డ్రీమ్ 11 Dream 11 స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగడమే. పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త బిల్లు ఆమోదం పొందడంతో, డ్రీమ్ 11 – బీసీసీఐ ఒప్పందాన్ని మధ్యలోనే ముగించింది.2026 వరకు ఉన్న ఈ ఒప్పందం మధ్యలోనే ముగియడంతో బీసీసీఐ (BCCI) కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతోంది. ఈ పరిణామంతో భారత జట్టు చారిత్రకంగా తొలిసారిగా స్పాన్సర్‌ లేకుండా ఆడనుంది.

    Aisa Cup | ముఖ్యమైన తేదీలు:

    • టోర్నీ ప్రారంభం: సెప్టెంబర్ 9, 2025
    • ఫైనల్ మ్యాచ్: సెప్టెంబర్ 28, 2025
    • వేదిక: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)

    More like this

    Hardhik Pandya | ఆసియా క‌ప్‌కి ముందు న‌యా హెయిర్ స్టైల్‌తో స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన హార్ధిక్ పాండ్యా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hardhik Pandya | ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్...

    Nizamabad City | స్నేహితులతో గాజుల సంబరాలు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో వినాయక ఉత్సవాలు (Ganesh Festival) ఘనంగా జరుగుతున్నాయి. ఆయా మండళ్ల...

    Congress Party | వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్‌.. బీహార్ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Congress Party | కాంగ్రెస్ పార్టీ కేర‌ళ విభాగం చేసిన ఓ పోస్టు కొత్త...