ePaper
More
    Homeక్రీడలుAsia Cup 2025 | ఆసియా కప్ 2025 .. ఆకాశాన్నంటుతున్న టీవీ, డిజిటల్ ప్రకటనల...

    Asia Cup 2025 | ఆసియా కప్ 2025 .. ఆకాశాన్నంటుతున్న టీవీ, డిజిటల్ ప్రకటనల రేట్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Asia Cup 2025 | 2025లో జరగనున్న ఆసియా కప్ (Asia Cup) టోర్నీ అభిమానుల్లోనే కాకుండా, ప్రచారాల్లోనూ భారీ హైప్ సృష్టిస్తోంది. టోర్నీ సెప్టంబర్​ 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సాగనుంది. ముఖ్యంగా భారత్ vs పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య సెప్టెంబర్ 14న జరగనున్న మ్యాచ్‌కు అంచనాలు తారాస్థాయికి చేరాయి. దీనివల్ల టీవీ, డిజిటల్ ప్రకటనల ధరలు (Advertising Prices) భారీగా పెరిగాయి. ఈ మెగా టోర్నమెంట్‌కు 2031 వరకూ మీడియా హక్కులు కలిగిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI), భారత్ మ్యాచ్‌ల కోసం 10 సెకన్ల ప్రకటనకు రూ. 14 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు వసూలు చేస్తోంది.

    టీవీ ప్రకటనల ప్యాకేజీలు ఇలా ఉన్నాయి..

    • కో-ప్రజెంటింగ్ స్పాన్సర్‌షిప్: ₹18 కోట్లు
    • అసోసియేట్ స్పాన్సర్‌షిప్: ₹13 కోట్లు
    • స్పాట్-బై ప్యాకేజీ (భారత్ + ఇతర మ్యాచ్‌లు): ₹16 లక్షలు / 10 సెకన్లు
    • మొత్తంగా ₹4.48 కోట్లు దాటే ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
    • డిజిటల్ ప్రకటనల రేట్లు (Sony LIV)
    • డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ అయిన Sony LIV కూడా తక్కువేమీ వ‌సూలు చేయ‌డం లేదు
    • ప్రకటనల రేట్లు ఇలా ఉన్నాయి:
    • కో-ప్రెజెంటింగ్ & హైలైట్స్ పార్ట్‌నర్: ఒక్కొక్కదానికి ₹30 కోట్లు
    • కో-పవర్డ్ బై ప్యాకేజీ: ₹18 కోట్లు
    • డిజిటల్ యాడ్స్‌లో 30% రిజర్వేషన్ – భారత్ మ్యాచ్‌లకు
    • ఫార్మాట్ ఆధారంగా ధరలు ఇలా ఉన్నాయి:
    • ప్రీ-రోల్ యాడ్స్: ₹275 (భారత్ మ్యాచ్‌లకు ₹500, భారత్ vs పాక్‌కి ₹750)
    • మిడ్-రోల్ యాడ్స్: ₹225 (భారత్ మ్యాచ్‌లకు ₹400, భారత్ vs పాక్‌కి ₹600)
    • కనెక్టెడ్ TV యాడ్స్: ₹450 (భారత్ మ్యాచ్‌లకు ₹800, భారత్ vs పాక్‌కి ₹1,200)

    ఇక ఆసియా కప్ 2025 Asia Cup షెడ్యూల్ చూస్తే..

    వేదిక: దుబాయ్, అబుదాబి
    మొత్తం జట్లు: 8
    మ్యాచ్‌లు: 19

    గ్రూప్ A: భారత్, పాకిస్తాన్, ఒమన్, యుఏఈ

    గ్రూప్ B: శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్

    భారత్ మ్యాచ్‌లు (గ్రూప్ స్టేజ్):

    సెప్టెంబర్ 10: భారత్ vs యుఏఈ (దుబాయ్)

    సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)

    సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబుదాబి)

    సూపర్ ఫోర్: టాప్ 2 గ్రూప్ జట్లు ప్రతి గ్రూప్ నుంచి అర్హత సాధిస్తాయి.

    భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్: సెప్టెంబర్ 14 (దుబాయ్)

    ఫైనల్: సెప్టెంబర్ 28 (దుబాయ్)

    ఏకైక సూపర్ ఫోర్ మ్యాచ్ అబుదాబిలో: సెప్టెంబర్ 22 – A2 vs B1

    Latest articles

    Anganwadi Centers | అంగన్​వాడీలకు ఫొటో క్యాప్చర్​ విధానాన్ని రద్దు చేయాలి

    అక్షరటుడే ఇందూరు : Anganwadi Centers | అంగన్​వాడీ ఉద్యోగుల ఫొటో క్యాప్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని...

    CMC college | ఆ వైద్యుడి నిర్వాకంవల్లే సీఎంసీకి దుస్థితి వచ్చింది..: షణ్ముఖ మహాలింగం

    అక్షరటుడే, డిచ్​పల్లి: CMC college | వైద్యుడు అజ్జ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన మోసం కారణంగానే డిచ్​పల్లి...

    Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు ఆన్​లైన్​లో సమాచారం నమోదు చేసుకోవాలి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | వినాయక మండళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ...

    Collector Nizamabad | సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు అందించాలి

    అక్షర టుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలపై సోలార్‌ పవర్‌...

    More like this