అక్షరటుడే, మెండోరా: ASI Suresh | ముప్కాల్ మండల కేంద్రంలో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న ప్రముఖ రచయిత తొగర్ల సురేష్‌కు (Asi Togarla Suresh) ఉత్తమ రచన పురస్కారం దక్కింది. శ్రీవాణి సాహిత్య పరిషత్ (Srivani Sahitya Parishad) సిద్దిపేట ఆధ్వర్యంలో వచ్చే నవంబర్‌లో తొగర్ల సురేష్‌కు ఉత్తమ రచన పురస్కారం అందజేయనున్నారు.
ASI Suresh | వెన్నెల్లో మాపల్లె పుస్తకం..
ఏఎస్సై తొగర్ల సురేష్ ‘వెన్నెల్లో మా పల్లె’ (vennello maa palle) అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి ఉత్తమ రచన పురస్కారం రావడంపై పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముప్కాల్ (Mupkal) గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఏఎస్సై సురేష్ మరెన్నో పుస్తకాలను రచించి ప్రముఖుల స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
‘వెన్నెల్లో మా పల్లె’ పుస్తకంలో తను చిన్నప్పుడు నందిపేట్ మండలం కుద్వాన్పూర్ గ్రామంలో విద్యనభ్యసించిన జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. కాగా.. ఈ పుస్తకానికి ఉత్తమ రచన పురస్కారం లభించడంపై సహోద్యోగులు, బంధువులు అభినందనలు తెలిపారు.
