అక్షరటుడే, కామారెడ్డి: ASI Constable Suspension | పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులపై వేటు పడింది. భిక్కనూరు(Bhiknoor) ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీస్ స్టేషన్లో (RamaReddy Police Station) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్ రెడ్డిలను సస్పెండ్ చేశారు.
ఈ మేరకు ఇన్‌ఛార్జి డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఏఎస్సై నర్సయ్య గతంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్‌లో (District Special Branch) పని చేసినప్పుడు ఒక పాస్‌పోర్టు దరఖాస్తుపై విచారణ చేపట్టాల్సిన సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. వెంకట్ రెడ్డి కూడా డీఎస్బీ లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల పాస్‌పోర్టు దరఖాస్తు విచారణలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు.
ASI Constable Suspension | కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ..
క్రిమినల్ కేసులు, ఎన్బీడబ్ల్యూఎస్(NBWS) పెండింగ్‌లో ఉన్నప్పటికీ నర్సయ్య, వెంకట్‌రెడ్డి ఇద్దరు ప్రాథమిక విచారణ చేయకుండానే ముగ్గురికి పాస్‌పోర్టు జారీ చేయడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఈ విషయం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) దృష్టికి రావడంతో విచారణ జరిపిన ఎస్పీ తన నివేదికను ఇన్‌ఛార్జి డీఐజీకి పంపించారు. నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా పరిగణించిన ఉన్నతాధికారి ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

