అక్షరటుడే, వెబ్డెస్క్ : Suryapeta | సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏఎస్సై (ASI) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
సూర్యాపేటలో ఎస్బీ (Special Branch) విభాగంలో ఏఎస్సైగా పని చేస్తున్న గోపగాని సత్యనారాయణ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఓ గేటేడ్ కమ్యూనిటీలోని తన ఇంట్లో ఏఎస్సై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సత్యనారాయణగౌడ్ సూర్యాపేట జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ సోదరుడు కావడం గమనార్హం. ఆయన మృతితో తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు.